సింగర్ మంగ్లీకి సినిమాలొ అవకాశాలు ఇక ఉండవా

మంగ్లీ పై హైదరాబాద్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఈ ఆరోపణలపై పోలీసు విచారణ ముగిసే వరకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వద్దని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు. గిరిజనులను మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేసినట్లు మంగ్లీ పై ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలపై పోలీసు విచారణ ముగిసే వరకు మూవీస్ లో అవకాశం ఇవ్వద్దని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు మంగ్లీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


తనకు పాటలు తప్ప స్కాములు తెలవని తనని అన్యాయంగా కేసులో లాగుతున్నారని నాకు ఈ మైక్రో ఫైనాన్స్ తో ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ అన్నారు. తను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉంటానని స్పష్టం చేశారు. తను పేదరికం నుంచి వచ్చానని, చాలా కష్టపడి ఇంతవరకు వచ్చానని డబ్బు విలువ కష్టం విలువ తనకు తెలుసని చెప్పుకొచ్చారు. నెలరోజులుగా ప్రోగ్రామ్స్ రికార్డింగ్ వదులుకున్నానని, బాధితులకు తను అండగా ఉంటానని ఆమె చెప్పారు. సిద్దు, మధు నాయక్,హిమకాంత్ రెడ్డి, సుబ్బారావు పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు మంగ్లీ.

author

Hari

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE