తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏడవడం కంటే…

ఆ రోజు ఇంట్లో చాలా నిశ్శబ్దంగా ఉంది…

అమ్మ చనిపోయి నాలుగు నెలలు అవుతోంది…

ఇప్పటికీ ఆ ఇంట్లో ఆమె వాసనే ఉంది…

వంటగదిలో ఆమె చేతి వాసన…

దిండు మీద ఆమె జుట్టు వాసన…

తలుపు దగ్గర ఆమె ఎదురు చూసిన చూపుల జ్ఞాపకం…

కానీ…

ఆమె మాత్రం లేదు…

ఆమె కొడుకు ఆ రోజు పాత అల్మారా సర్దుతున్నాడు…

పాత చీరలు… మందుల కవర్లు… కళ్లద్దాలు…

వాటి మధ్యలో ఒక పాత డైరీ…

పైకి చిన్నగా రాసి ఉంది…


“నా కొడుకుకి… నేను చెప్పలేకపోయిన మాటలు…”


ఆ లైన్ చూసి అతను చిన్నగా నవ్వుకున్నాడు…

“అమ్మ కూడా ఏవేవో రాసేది…” అనుకున్నాడు…

కానీ…

డైరీ తెరిచిన కొన్ని నిమిషాల్లోనే

అతని కళ్లలో నీళ్లు నిండిపోయాయి…

“నాన్నా…

నువ్వు పుట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది…

నిన్ను మొదటిసారి నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు

నేను దేవుడిని తాకినట్టు అనిపించింది…

నువ్వు ఏడిస్తే నేను భయపడేదాన్ని…

నువ్వు నవ్వితే నా ప్రపంచం వెలిగిపోయేది…

నీ చిన్న చేతులతో నా వేళ్లు పట్టుకుని నిద్రపోయేవాడివి…

రాత్రి నీకు జ్వరం వచ్చినప్పుడు

నేను ఒక్క క్షణం కూడా కళ్లుమూయలేదు…

నీ కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను…

కానీ అలసిపోలేదు…

ఎందుకంటే…

నువ్వు నా కొడుకువి కాబట్టి…”

అతని చేతులు వణకడం మొదలైంది…

తన చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకున్న జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు తిరిగాయి…

“నువ్వు స్కూల్‌కి వెళ్లే రోజుల్లో

నీ బ్యాగ్‌లో టిఫిన్ పెట్టేటప్పుడు

నువ్వు తింటావో లేదో అని నేను ఆలోచించేదాన్ని…

నీకు కొత్త షర్ట్ కొనిపెట్టడానికి

నేను పాత చీర వేసుకున్న రోజులు ఉన్నాయి…

నీ ఫీజు కోసం

నా బంగారం అమ్ముకున్న రోజులు ఉన్నాయి…

కానీ…

అవి నీకు ఎప్పుడూ చెప్పలేదు…

ఎందుకంటే…

తల్లి ప్రేమ లెక్కలు చెప్పదు నాన్నా…”

ఆ కొడుకు కళ్లలో కన్నీళ్లు జారిపోయాయి…

తన పెళ్లి తర్వాత జరిగిన ప్రతిదీ గుర్తొచ్చింది…

అమ్మ మాట్లాడాలని వస్తే

“ఇప్పుడు టైమ్ లేదు అమ్మా…” అని చెప్పిన సందర్భాలు…

ఆమె ఒంటరిగా భోజనం చేసిన రాత్రులు…

ఆమె మందులు అయిపోయినా

తాను పట్టించుకోని రోజులు…

డైరీలో ఇంకో పేజీ…

ఆ పేజీ మీద కన్నీటి మరకలు ఎండిపోయి ఉన్నాయి…

“నాన్నా…

నీ భార్య వచ్చిన తర్వాత

నువ్వు మారిపోయావు అని నేను ఎప్పుడూ బయటకి చెప్పలేదు…

ఎందుకంటే…

నిన్ను తప్పుపట్టడం నాకు రాదు…

కానీ…

ఒకప్పుడు

‘అమ్మా నువ్వు తిన్నావా?’ అని రోజుకి పది సార్లు అడిగిన నువ్వు…

చివరికి

నేను నీతో మాట్లాడటానికి కూడా టైమ్ అడగాల్సి వచ్చింది…

నీ చిన్నప్పుడు

నువ్వు నిద్రపోయే వరకు నేను నీ పక్కనే ఉండేదాన్ని…

కానీ…

నా చివరి రోజుల్లో

నాతో ఐదు నిమిషాలు కూర్చోడానికి కూడా నీకు సమయం లేకపోయింది…”

ఆ లైన్ చదివిన వెంటనే

అతను గట్టిగా ఏడ్చేశాడు…

ఎందుకంటే…

అది నిజం…

తల్లి చనిపోయే ముందు రోజు కూడా

ఆమె “కొంచెం కూర్చో నాన్నా…” అని చెప్పింది…

అతను మాత్రం…

“అమ్మా చాలా పని ఉంది… తర్వాత మాట్లాడదాం…” అని వెళ్లిపోయాడు…

ఆ “తర్వాత” ఇక రాలేదు…

డైరీ చివరి పేజీ…

అక్కడ అక్షరాలు కూడా వణికిపోయినట్టున్నాయి…

“నాన్నా…

రేపు నీకు పిల్లలు పుడతారు…

వాళ్లు చిన్నప్పుడు

నీ వెనకాల తిరుగుతారు…

నిన్నే ప్రపంచం అనుకుంటారు…

కానీ ఒకరోజు

వాళ్లు కూడా పెద్దవాళ్లు అవుతారు…

అప్పుడు…

దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకో…

నిన్ను చిన్నప్పుడు చేతుల్లో మోసిన తల్లిదండ్రులను

వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయొద్దు…

ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేముందు

ఒక్కసారి ఆలోచించు…

నీ చిన్నప్పుడు నీకు భయం వేసిన ప్రతిరోజు

వాళ్లు నీ పక్కనే ఉన్నారు…

ఇప్పుడు వాళ్లకు వృద్ధాప్యం అనే భయం వచ్చినప్పుడు

వాళ్ల పక్కన నువ్వు ఉండాలి నాన్నా…”

ఆఖర్లో ఒక్క లైన్ మాత్రమే ఉంది…

**“తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏడవడం కంటే…

వాళ్లు బ్రతికుండగానే ప్రేమగా మాట్లాడటం చాలా గొప్పది…”**

ఆ డైరీని గుండెలకి హత్తుకుని

ఆ కొడుకు చిన్నపిల్లాడిలా ఏడ్చాడు…

అమ్మ ఫోటో ముందు కూర్చుని…

“అమ్మా…

నువ్వు అడిగింది డబ్బు కాదు…

కొంచెం ప్రేమ మాత్రమే కదా…” అని విలపించాడు…

కానీ…

ఆ ఇంట్లో ఇప్పుడు సమాధానం చెప్పడానికి అమ్మ లేదు…

ఎందుకంటే…

**తల్లులు వెళ్లిపోయాక

ఇంటి గోడలు ఉంటాయి…

జ్ఞాపకాలు ఉంటాయి…

కానీ…

‘నాన్నా తిన్నావా?’ అని అడిగే ఆ ఒక్క ప్రాణం మాత్రం ఉండదు.


     ✍🏻 జెట్టి హిమబిందు ✍🏻

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE