- by Ganesh Adla
ఆమె నమ్మకం చనిపోయిన రోజు…
-
- by Ganesh Adla
- in National
- 0 likes
ఒక చిన్న పట్టణంలో నివేద అనే అమ్మాయి ఉండేది…
చాలా అమాయకం.
ప్రేమ అంటే జీవితమంతా అనుకునే వయసు.
ఆమె జీవితంలోకి అర్జున్ వచ్చాడు.
మొదట “జాగ్రత్తగా వెళ్లావా?” అని అడిగిన మెసేజ్…
తర్వాత “నువ్వు లేక నేను ఉండలేను…” అన్న మాటలు…
అలా రోజులు గడిచేకొద్దీ ఆమె ప్రపంచం మొత్తం అతడే అయిపోయాడు.
ఆమె ఫోన్‌లో ఎక్కువగా ఉన్న పేరు…
ఆమె హృదయంలో చివరిగా నమ్మిన మనిషి కూడా అతడే.
ఒక రోజు…
అర్జున్ అన్నాడు:
“ప్రేమిస్తే నన్ను నమ్మాలి కదా…”
ఆ ఒక్క మాటతో…
ఆమె తన హద్దులు కూడా దాటింది.
మనసు మాత్రమే కాదు…
తన శరీరాన్నీ అతనికే అప్పగించింది.
ఎందుకంటే ఆమెకి అది “టైంపాస్” కాదు.
జీవితం.
కానీ…
కొన్ని నెలల తర్వాత ఆమె చేతులు వణికిపోయాయి.
ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో రెండు గీతలు కనిపించాయి.
ఆమె ఏడుస్తూ అర్జున్‌కి కాల్ చేసింది.
అతను కొద్దిసేపు మౌనం వహించి చివరికి అన్నాడు:
“ఇప్పుడు బేబీ వద్దు…
మన లైఫ్ spoil అవుతుంది…”
ఆమె గుండె ఒక్కసారిగా పగిలిపోయింది.
“మన ప్రేమ?” అని అడిగింది.
అతను చల్లగా నవ్వి అన్నాడు:
“అంత సీరియస్‌గా ఎందుకు తీసుకున్నావు…?”
ఆ రోజు…
ఒక అమ్మాయి ఒక్కసారిగా పెద్దదైపోయింది.
హాస్పిటల్‌లో అబార్షన్ పేపర్ మీద సైన్ చేస్తూ…
ఆమె చేతులు వణికాయి.
డాక్టర్ అడిగింది:
“హస్బెండ్ ఎక్కడ?”
ఆమెకి సమాధానం రాలేదు.
ఆపరేషన్ రూమ్‌లో పడుకున్నప్పుడు…
ఆమె కడుపులో పెరుగుతున్న చిన్న ప్రాణం కన్నా…
తన నమ్మకం చనిపోతుందనే బాధ ఎక్కువగా అనిపించింది.
ఆ రోజు తర్వాత…
నివేద బయటికి నవ్వేది.
కానీ రాత్రిళ్లు మాత్రం తన ఛాతీ మీద చేయి పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడ్చేది.
ఎందుకంటే…
ఒక అమ్మాయి శరీరంపై మిగిలిన గాయం కంటే…
ఆమె మనసులో మిగిలిన ద్రోహం ఎక్కువ నొప్పిస్తుంది.
సంవత్సరాలు గడిచాయి.
అర్జున్ పెళ్లి చేసుకున్నాడు.
జీవితం బాగానే సాగుతున్నట్టు కనిపించింది.
కానీ…
ఒకరోజు అతని భార్య కూడా ఏడుస్తూ అతని ముందే చెప్పింది:
“నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు కదా…
ఇంకొకరితో రిలేషన్‌లో ఉన్నావని తెలిసింది…”
ఆ క్షణంలో…
అర్జున్‌కి ఒక్కసారిగా నివేద గుర్తొచ్చింది.
హాస్పిటల్ బెడ్ మీద ఏడ్చిన ఆ అమ్మాయి…
“మన ప్రేమ?” అని అడిగిన ఆ గొంతు…
అన్నీ తిరిగి వినిపించాయి.
అప్పుడు అతనికి అర్థమైంది:
“కర్మ అంటే వెంటనే శిక్ష కాదు…
మన వల్ల ఎవరో చచ్చిపోయినంతగా ఏడ్చిన బాధ…
ఒక రోజు మన హృదయంలోనూ పుడుతుంది.”
ఈ రోజుల్లో చాలామంది ప్రేమను టైంపాస్‌గా చూస్తున్నారు…
“ఫీలింగ్స్” ని గేమ్‌లా తీసుకుంటున్నారు.
కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే—
ఒక అమ్మాయి “ఓకే” చెప్పే ముందు ఎన్నిసార్లు భయపడుతుందో…
ఒక అబ్బాయి “నిన్ను నమ్ముతున్నా” అనే మాట కోసం ఎంతగా ఎదురుచూస్తాడో…
మనకు కనిపించదు.
ప్రేమ పేరుతో ఇచ్చిన మోసం…
ఒక జీవితాన్ని మొత్తం చీకటిగా మార్చొచ్చు.
అందుకే…
ప్రేమించలేకపోతే దగ్గర కావొద్దు
బాధ్యత తీసుకోలేకపోతే హద్దులు దాటొద్దు
ఒకరి శరీరాన్ని తాకే ముందు… వారి మనసును గౌరవించడం నేర్చుకోవాలి
ఎందుకంటే…
ఈ కాలంలో కర్మ కోర్ట్‌లా శిక్షించదు…
మన నిద్రను, మనశ్శాంతిని, మన హృదయాన్ని నెమ్మదిగా తీసుకుపోతుంది.
✍🏻 జెట్టి హిమబిందు ✍🏻
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply