- by Ganesh Adla
పిల్లలు స్కూల్ రీఓపెనింగ్ తర్వాత ఎలా ఫీల్ అవుతారు?
-
- by Ganesh Adla
- in Health
- 0 likes
కొందరికి కొత్త క్లాస్ భయం ఉంటుంది. కొత్త టీచర్ ఎలా ఉంటారో అనుకుంటారు. “నేను చదువు మర్చిపోయానేమో” అనిపిస్తుంది. మళ్లీ ఉదయం త్వరగా లేవడం కష్టంగా ఉంటుంది. కొందరికి ఫ్రెండ్స్‌ని కలవడం ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఇంకొందరికి “హాలిడేస్ ఇంకా ఉంటే బాగుండేది” అనిపిస్తుంది. ఇది “లేజీనెస్” కాదు…ఇది “మైండ్ ట్రాన్సిషన్”. ఆ మూడ్‌ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
🌼 తల్లిదండ్రులకు ముఖ్యమైన టిప్స్
1. ఒక్కసారిగా స్ట్రిక్ట్ అవ్వకండి
“చదువు మొదలుపెట్టు!” అని ఒక్కరోజులో ప్రెజర్ పెడితే పిల్లలు ఇంకా దూరం అవుతారు. మెల్లగా స్కూల్ రూటీన్‌కి అలవాటు చేయాలి.
2. స్కూల్ గురించి భయం కాదు… ఉత్సాహం కలిగించండ
❌ “ఇంకా ఆడితే టీచర్ కొడతారు”
✅ “నీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా!”
పిల్లల మైండ్‌లో స్కూల్ అంటే శిక్ష కాదు…ఒక అందమైన ప్రపంచంలా అనిపించాలి.
3. నిద్ర టైమ్ మెల్లగా మార్చండి
సెలవుల్లో ఆలస్యంగా పడుకున్న పిల్లలను ఒక్కరోజులో 5 గంటలకు లేపితే చిరాకు వస్తుంది. అందుకే రీఓపెన్‌కు వారం ముందు నుంచే: 30 నిమిషాలు ముందుగా నిద్రపెట్టాలి. 30 నిమిషాలు ముందుగా లేపాలి
4. కొత్త వస్తువులతో మోటివేట్ చేయండి. కొత్త బ్యాగ్, కొత్త పెన్, కొత్త వాటర్ బాటిల్…ఇవి పిల్లలలో స్కూల్ మీద చిన్న ఎగ్జైట్మెంట్ పెంచుతాయి.
5. మార్కుల గురించి మొదటి రోజే మాట్లాడొద్దు. “ఈసారీ 1st రావాలి” అని మొదటినుంచే ఒత్తిడి పెడితే పిల్లలలో భయం పెరుగుతుంది. ముందు వాళ్లు స్కూల్‌కు మెంటల్‌గా కనెక్ట్ అవ్వాలి.
🌸 స్టూడెంట్స్‌కి టిప్స్
1. మొదటి రోజు నుంచే పర్ఫెక్ట్ కావాలని అనుకోకండి. మొదటి వారం కాస్త అలసట సహజం. మీ మైండ్ మళ్లీ స్టడీ మోడ్‌లోకి రావడానికి టైమ్ పడుతుంది.
2. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఈరోజు క్లాస్ అటెండ్ అవ్వాలి. ఈరోజు హోంవర్క్ పూర్తి చేయాలి. ఈరోజు టీచర్ చెప్పింది వినాలి. ఇలా చిన్న స్టెప్స్‌తో మొదలు పెట్టాలి.
3. ఫోన్ టైమ్ తగ్గించండి. హాలిడేస్‌లో ఎక్కువ ఫోన్ చూసి ఉంటారు. చదువుపై ఫోకస్ రావాలంటే: స్క్రీన్ టైమ్ తగ్గించాలి, నిద్ర బాగా పడాలి. ఉదయం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి.
4. ఫ్రెండ్స్‌తో కంపేర్ అవ్వకండి- “అతను అంత చదివాడు… నేను చదవలేదు…” అనుకోవద్దు. ప్రతి స్టూడెంట్ మళ్లీ మొదలుపెడుతున్నాడే.
5. టీచర్‌ని భయపడకండి- ఏదైనా అర్థం కాకపోతే అడగండి. అడిగే పిల్లలే ముందుకు వెళ్తారు.
🌼 టీచర్స్ ఎలా పిల్లల్ని ట్రాక్ చేయాలి?
1. మొదటి వారం చదువుకంటే కనెక్షన్ ముఖ్యం
పిల్లలు ఎలా ఉన్నారు?
వాళ్ల మూడ్ ఎలా ఉంది?
ముందు అది అర్థం చేసుకోవాలి.
2. మొదటి రోజే భారీ హోంవర్క్ ఇవ్వొద్దు
స్కూల్ మీద ఇబ్బంది పెరగకుండా:
ఫన్ యాక్టివిటీస్
ఇంట్రడక్షన్ గేమ్స్
చిన్న రివిజన్స్ చేయాలి
3. సైలెంట్ పిల్లలను గమనించాలి
కొంతమంది పిల్లలు:
మాట్లాడరు
నవ్వరు
క్లాస్‌లో కలవరు
వాళ్లకు టైమ్ ఇచ్చి దగ్గర చేయాలి.
4. “మార్క్స్” కంటే “మైండ్” ముఖ్యం
హాలిడేస్ తర్వాత పిల్లల మైండ్ మళ్లీ సెట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది.
అందుకే మొదటి నెలలో మోటివేషన్ ఎక్కువ అవసరం.
5. ప్రతి చిన్న ప్రయత్నాన్ని అభినందించాలి
“Very good” అనే ఒక్క మాట కూడా పిల్లలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది.
🌸 స్కూల్ రీఓపెనింగ్‌లో అసలు అర్థం
కొత్త బ్యాగ్స్ కాదు…
కొత్త ఆశలు.
కొత్త క్లాస్ కాదు…
కొత్త ప్రారంభం.
పిల్లల్ని చదివించడమే కాదు…
వాళ్లలో జీవితం మీద నమ్మకం పెంచడం కూడా స్కూల్ పని.
ఒక టీచర్ మంచి మాట…
ఒక తల్లి ప్రేమ…
ఒక తండ్రి ప్రోత్సాహం…
ఒక పిల్లవాడి భవిష్యత్తుని మార్చగలవు. 🌼
✍🏻 జెట్టి హిమబిందు ✍🏻
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply