రావి చెట్టును ఎందుకు ఒక పవిత్రమైన చెట్టుగా భావిస్తారు!!

మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి అండ్ అలానే ఇంకా కొన్ని చెట్లకి కొన్ని ప్రత్యేక స్థానం ఉంది అది ఎంతవరకు తెలుసు? ఎంతమందికి తెలుసు? 

మా అత్తయ్య గారు ప్రతిరోజు పూజ చేస్తారు, సాయంత్రం కూడా దీపం వెలిగిస్తారు, ఈ దీపం వెలిగించే టైంలో ఇరుగు మా లక్ష్మి రావే పొరుగు మా లక్ష్మి రావే సందెవేళ మా ఇంటికి రావే సందమహాలక్ష్మి అని చెప్పి ఒక శ్లోకం చెప్తారు. అండ్ అలాగే మార్నింగ్ నార్మల్గా వినాయకుడు మంత్రాలు చదివి ఎవరెవరైతే దేవతలు ఉన్నారో దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ పేర్లతోనే ఇలాంటివన్నీ కూడా చదువుతారు. మా అత్తయ్య అసలు చదువుకోలేదు కానీ మా అత్తయ్య మావయ్య గారు ఎక్కువగా పూజలు చేసేవారు, సో దానివల్ల వాళ్ళకి మంత్రాల అలవాటు. ఆ మంత్రాలులోని ఈ మంత్రాలు కూడా చెప్పవారన్నమాట. సో ఈ మంత్రాలు లోనే ఒక శ్లోకం ఉంటది, మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిని అగ్రత శివరూపాయ వృక్షజాతయే నమః అని చెప్పేసి అంటే ఇది రావి చెట్టు దగ్గర ఎక్కువగా చెప్పే శ్లోకం అనమాట, ఇది నేను మా అత్తగారు చెప్తుంటే విన్న శ్లోకం ఇది. ఈ శ్లోకం చూస్తూనే మనకి తెలిసిపోతుంది, రావిచెట్టు దగ్గర మనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మన హిందువులు.

మూలతో బ్రహ్మ రూపాయ అంటే రావి చెట్టు మొదలు బ్రహ్మ రూపం ఉంటుందంట అండ్ మధ్యతో విష్ణు రూపిని అంటే మధ్య భాగంలో విష్ణు దేవుడు ఉంటాడంట అగ్రత శివరూపాయ అంటే పైన ఇంకా అగ్రతా అంటే ఇంక పైన పై భాగంలో రుద్రుడు అంటే శివుడు ఉంటారంట అంటే ఈ రావి చెట్టు మీద ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా ఉంటారు అనమాట. అందుకే రావి చెట్టుని అంత గొప్ప చెట్టు అంత గొప్ప ప్రాముఖ్యత ఇస్తారన్నమాట. అలాగే ఈ రావి చెట్టుని ఒక వేదాంతంతో కూడా పోలుస్తారు అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు చెట్లు అన్నిట్లో కూడా అశ్వద్ధము అంటే రావి చెట్టు అన్నమాట. అన్ని చెట్లు కలిసి ఉన్నది అని చెప్పేది ఇలా మనకి భగవద్గీతలో కూడా వివరిస్తారు. శ్రీకృష్ణుడే స్వయంగా వివరించి ఉన్నాడు, భగవద్గీతలో కూడా మనం భగవద్గీత చదివినట్లయితే మనకు భగవద్గీతలో కూడా ఈ రావి చెట్టు ప్రస్తావన అనేది వస్తదనమాట. అశ్వత్థము అని చెప్పేసి వస్తది అంటే అశ్వత్థ వృక్షము ఎరిగిన వాడు వేదంలో నెరిగిన వాడు అని చెప్పి చెప్పినట్టు దీని అర్థం. మన హిందూ పురాణాల్లో నండి అండ్ అలానే మన హిందూ పూర్వీకుల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే అవునా నిజమా అనిపిస్తది.

మన హిందూ పురాణాలు అంత గొప్పవన్నమాట, ఇంద్రాది దిక్పాలకులు అని కూడా అంటారు చూశారా అష్టవసులో ఏకాదశి రుద్ర లో ద్వాదశ ధిత్యులు ఇవన్నీ కూడా రావి చెట్టు కొమ్మలలో ఆశ్రయించి ఉంటాయి అంటవి ఇవి అందరూ కూడా అంటే అష్టాదశలో ఏకాదశి రుద్రులు వీళ్ళందరూ కూడా రావి వృక్షపు అంటే రావి చెట్టు యొక్క కొమ్మల్లోనే ఆశ్రయించి ఉంటారు అన్నమాట. ఈ రావి చెట్టుకి మనము దేవాలయాలకు వెళ్లి ప్రదక్షిణలో ఎలా చేస్తామో అలాగే ఈ రావి చెట్టు కూడా ప్రదక్షిణాలు చేస్తే మనకి అనంతమైన ఫలితాలు జరుగుతాయి అంట అండి అనంతమైన ఫలితాలు మనకి లభిస్తాయి. ఈ రావి చెట్టుకి ఘన మనము ప్రదక్షిణము చేస్తే అండ్ అలానే సూర్యోదయానికి ముందే రావి చెట్టుకి పూజ చేసే ప్రదక్షిణలు చేసి అక్కడ కాసేపు మనం అలా ధ్యాన జపములు చేసి ఇలాంటివన్నీ చేసే మన పిల్లలకి గానీ అండ్ మనకి గాని మంచి బుద్ధి జ్ఞానములు కూడా వస్తాయన్నమాట.

అలాగే మన హిందూ పురాణాల్లోనే మనకి వ్రతాలు కానీ నోములు కానీ అభిషేకాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పని ఉంటుందన్నమాట చేసే విధానం అది ఎలా ఉంటుందో అనేది ఉంటుంది రావి చెట్టు దగ్గర కూడా ఒక వ్రతం చేస్తారు ఆ వ్రతం పేరు ఏంటంటే అమాసోమవార వ్రతము అని చెప్పేసి ఒక వ్రతం చేస్తారు. ఆ వ్రత విధానం కూడా మనకి ఎలాగా ఏంటి అనేది మా అత్తయ్య గారు అప్పుడు అప్పట్లో చెప్పేవారు, ఈ వ్రతం ఇలా చేస్తే మనకి వరలక్ష్మి వ్రతం ఎలా అయితే చేస్తామో అదే విధంగా సోమవారం వ్రతం కూడా చేస్తే మనకి దానికి తగ్గ ఫలితం కూడా మంచిగా లభిస్తుంది అని చెప్పేవారన్న మాట. మా అత్తయ్య గారు మన హిందూ పూర్వీకులు గురించి ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుందండి ఇంత గొప్ప సైన్స్ అండ్ భక్తి ఉన్నది మన హిందు ధర్మంలోనే అని చెప్పేసి చాలా గొప్ప గా అనిపిస్తుంది అండి నాకు. సో మొత్తం గా నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఇక్కడ ఈ రావి చెట్టు అనేది ఎంతో మందికి నీడ నేస్తోంది ఎన్నో పక్షులకి ఆశ్రయం ఇస్తుంది అండ్ అలానే ఎంతోమంది జీవులకి కూడా ఆశ్రయం కల్పిస్తుంది. అందుకే మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు ఒక సాధారణమైన చెట్టుగా కాకుండా ఒక పవిత్రమైన చెట్టుగా భావించి దానిని గౌరవిస్తారు. 🙏🏻 


✍🏻 జెట్టి హిమబిందు ✍🏻

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE