మేమూ మనుషులమే…!!

“మేమూ మనుషులమే…”

బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్…

ఎండ మండుతోంది.

వాహనాలు ఆగాయి.

ఒక హిజ్రా వచ్చి కార్ గ్లాస్ తట్టింది.

లోపల కూర్చున్న రమేష్ అసహనంగా చూసాడు.

“అమ్మా… ఇప్పుడే salary కూడా రాలేదు… change లేదు…” అన్నాడు.

కానీ ఆమె మళ్లీ డబ్బు అడిగింది.

కొంచెం గట్టిగానే.

రమేష్‌కి కోపం వచ్చింది.

“ఎందుకిలా force చేస్తారు మీరు…?” అని అన్నాడు.

ఆమె ఒక్కసారి నిశ్శబ్దంగా చూసింది.

ఏమీ మాట్లాడలేదు.

సిగ్నల్ గ్రీన్ అయింది.

వాహనాలు వెళ్లిపోయాయి.

ఆ రాత్రి…

రమేష్ ఇంట్లో భార్యతో మాట్లాడుతున్నాడు.

“ఈరోజు మళ్లీ signal దగ్గర వాళ్లు చాలా force చేశారు…

మన పరిస్థితి కూడా బాగోలేదు అని చెప్పినా వినరు…”

అతని 10th చదివే కూతురు మెల్లగా అడిగింది:

“నాన్నా… వాళ్లు ఎందుకు అలా అడుగుతారు… వాళ్లకి పని ఉండదా…?”

ఆ ప్రశ్నకి రమేష్ దగ్గర వెంటనే answer లేదు.

కొన్ని రోజుల తర్వాత…

ఒక NGO awareness program కి అతను వెళ్లాడు.

అక్కడ ఒక హిజ్రా మాట్లాడింది.

ఆమె పేరు “సౌమ్య”.

ఆమె మైక్ పట్టుకుని చెప్పిన మాటలు హాల్ మొత్తం సైలెంట్ చేశాయి.

“మేము పుట్టినప్పుడు…

మాకు కూడా అమ్మ కౌగిలి ఉంటుంది…

మేమూ చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లాలని అనుకుంటాం…

కానీ society ముందుగా మా పేరును కాదు…

మా gender ని చూస్తుంది.

స్కూల్లో నవ్వుతారు…

ఇంట్లో దాచిపెడతారు…

పని అడిగితే తిరస్కరిస్తారు…

చాలామంది కంపెనీలు job ఇవ్వరు.

ఇంటర్వ్యూకి వెళ్లినా ముఖం చూసి reject చేస్తారు.

మరి బ్రతకడానికి మేమేం చేయాలి…?”

హాల్‌లో చాలామంది తలలు కిందకి వంచారు.

ఆమె కొనసాగించింది.

“అవును…

కొంతమంది మా వాళ్లు డబ్బులు గట్టిగా అడుగుతారు.

కొన్నిసార్లు దౌర్జన్యంగా కూడా behave చేస్తారు.

అది సరైంది కాదు.

ఎందుకంటే…

ఎదురుగా ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటో మనకు తెలియదు.

ఒక 100 రూపాయల కోసం

ఒక కుటుంబం ఆ రోజు భోజనం మానేసి ఉండొచ్చు.

అది మేమూ అర్థం చేసుకోవాలి.

కానీ…

మాకు గౌరవంగా పని ఇచ్చి ఉంటే…

మమ్మల్ని కూడా సాధారణ మనుషుల్లా చూసి ఉంటే…

ఈ పరిస్థితుల్లో చాలామంది ఉండేవారు కాదు…”

ఆ మాట విన్న రమేష్ కళ్లలో ఏదో మారింది.

అతనికి అర్థమైంది…

ప్రతి కథకి రెండు వైపులుంటాయని.

ఒకవైపు —

డబ్బులు అడిగేటప్పుడు భయపడే కుటుంబాలు.

మరోవైపు —

జీవితం మొత్తం “నువ్వు వేరే” అని వినిపిస్తూ బ్రతికే మనుషులు.

ఈ సమస్యకి పరిష్కారం ఏంటి?

సమాజం చేయాల్సింది:

వాళ్లని అవమానించకుండా చూడాలి

Education & jobs ఇవ్వాలి

Talent ఉంటే అవకాశం ఇవ్వాలి

భయంతో కాదు, గౌరవంతో మాట్లాడాలి

వాళ్లు కూడా గుర్తుంచుకోవాల్సింది:

డబ్బు అడిగేటప్పుడు ఎదుటివారి పరిస్థితి అర్థం చేసుకోవాలి

భయపెట్టి తీసుకోవడం కాదు, మనసు గెలుచుకోవాలి

గౌరవం కోరుకుంటే, గౌరవం ఇవ్వాలి

చివరగా…

మనిషిని gender తో కాదు…

గుండెతో చూడాలి.

ఎందుకంటే…

కొన్ని గాయాలు శరీరంపై కనిపిస్తాయి…

కొన్ని గాయాలు మాత్రం సమాజం మాటల్లో దాగి ఉంటాయి.


✍🏻 జెట్టి హిమబిందు ✍🏻

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE