రోడ్డుపై జరిగే చాలా ఆక్సిడెంట్స్ “తెలియక” కాదు..!

రోడ్డుపై జరిగే చాలా ఆక్సిడెంట్స్ “తెలియక” కాదు…

తెలుసుకుని చేసే చిన్న నిర్లక్ష్యాల వల్లే.

మనకు ప్రతిరోజూ Newsలో కనిపిస్తాయి —

ఒక కుటుంబం పూర్తిగా నాశనం అయింది…

ఒక చిన్న పిల్లాడు తండ్రిని కోల్పోయాడు…

కొత్తగా పెళ్లైన అమ్మాయి విధవరాలైంది…

అన్నీ చూస్తారు…

ఒక్క నిమిషం “చాలా బాధగా ఉంది” అంటారు…

కానీ మరుసటి రోజే అదే స్పీడ్… అదే ఫోన్… అదే డ్రింక్ అండ్ డ్రైవ్.

ఎందుకు అంటే…

మనిషికి ఒక ప్రమాదకరమైన అలవాటు ఉంది:

“చెడేది ఇతరులకే జరుగుతుంది… నాకు కాదు” అని అనుకోవడం.

అదే చాలా పెద్ద కారణం.

ఆక్సిడెంట్స్ కి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి?

1. అతి నమ్మకం (Over Confidence)

“నాకు డ్రైవింగ్ బాగా వస్తుంది…”

“నేను కంట్రోల్ చేసేస్తా…”

“ఒక్కసారి స్పీడ్ పెంచితే ఏం అవుతుంది…”

అని అనుకునే క్షణమే ప్రమాదం దగ్గరపడుతుంది.

రోడ్డు మీద మన ప్రాణం మాత్రమే కాదు…

ఎదురుగా వచ్చే వాళ్ల ప్రాణం కూడా ఉంటుంది.

2. డ్రింక్ అండ్ డ్రైవ్

తాగిన తర్వాత brain slow అవుతుంది.

దూరం అంచనా తప్పుతుంది

reaction time తగ్గుతుంది

balance పోతుంది

judgement తప్పుతుంది

కానీ మత్తులో ఉన్నప్పుడు వాళ్లకి వాళ్లు “perfect గా ఉన్నాం” అనిపిస్తుంది.

అందుకే చాలామంది: “నేను manage చేస్తా” అని వాహనం ఎక్కుతారు.

ఒక్క mistake…

జీవితం అంతా punishment.

3. ఫోన్ మోజు

ఇప్పుడు చాలామంది drive చేస్తూ కూడా:

reels చూస్తారు

calls మాట్లాడతారు

chats చేస్తారు

కేవలం 2 seconds కళ్లను రోడ్డుపై నుంచి తిప్పితే చాలు…

అది ఒక జీవితాన్ని తీసేయడానికి సరిపోతుంది.

4. స్పీడ్ అంటే స్టైల్ అనుకోవడం

కొంతమందికి speed అంటే attitude.

Bike loudగా వెళ్లాలి…

Friends ముందు stunt చేయాలి…

Video తీయాలి…

కానీ రోడ్డు సినిమా set కాదు.

అక్కడ ఒక్క slip అంటే…

cut చెప్పే director ఉండడు.

5. చిన్న careless habits

Helmet పెట్టుకోకపోవడం

Seat belt వేసుకోకపోవడం

Wrong side వెళ్లడం

Signal break చేయడం

ఇవి చిన్నవి అనిపిస్తాయి…

కానీ చాలాసార్లు ఇవే చివరి mistakes అవుతాయి.

కానీ అసలు బాధ ఏంటంటే…

ఆక్సిడెంట్ అయిన వ్యక్తి ఒక్కరే చనిపోడు…

ఆయనతో పాటు:

ఒక తల్లి నవ్వు చనిపోతుంది

ఒక భార్య జీవితాంతం ఒంటరిగా మిగులుతుంది

ఒక పిల్లవాడి future కూలిపోతుంది

రోడ్డుమీద పడిపోయేది body మాత్రమే కాదు…

ఒక కుటుంబం మొత్తం.

అందుకే గుర్తుంచుకోవాల్సిన విషయం:

ఇంట్లో ఎవరో మన కోసం ఎదురుచూస్తున్నారు

మనం safe గా చేరడం కూడా ఒక బాధ్యతే

speed కంటే life important

ఒక్క call later చేయొచ్చు… కానీ ప్రాణం తిరిగి రాదు

**“రోడ్డు మీద హీరోలా కాదు…

ఇంటికి సేఫ్‌గా చేరే మనిషిలా డ్రైవ్ చేయాలి.”


✍🏻 జెట్టి హిమబిందు ✍🏻

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE