- by Ganesh Adla
ఒక మార్క్… ఒక జీవితం!!
-
- by Ganesh Adla
- in National
- 0 likes
“ఒక మార్క్… ఒక జీవితం”
జూన్ మొదటి వారం…
వాన వాసనతో స్కూల్ మళ్లీ తెరుచుకుంది.
కొత్త బ్యాగులు… కొత్త బుక్స్… కొత్త క్లాస్‌రూమ్స్…
కానీ 10th క్లాస్‌లోకి వచ్చిన “అఖిల్” ముఖంలో మాత్రం కొత్త ఆశ లేదు.
అతనికి చదువు అంటే భయం.
ఎందుకంటే…
9th వరకు somehow పాస్ అయ్యాడు.
ఇంగ్లీష్ వీక్…
మ్యాథ్స్ అంటే టెన్షన్…
అందరూ “ఈ వాడు చదవడు” అని చెప్పేవారు.
స్కూల్ మొదటి రోజు టీచర్ ఒక్క మాట చెప్పారు.
“ఈ ఏడాది మీ జీవితాన్ని మార్చే సంవత్సరం…
మీరు ఇప్పుడు చేసే చిన్న అలవాట్లు… రేపటి మీ భవిష్యత్తు అవుతాయి.”
క్లాస్‌లో అందరూ సైలెంట్‌గా విన్నారు.
అఖిల్ మాత్రం కిందకి చూసుకున్నాడు.
ఎందుకంటే అతనికి తన మీద నమ్మకం లేదు.
ఆ రోజు ఇంటికి వచ్చాక…
అతని అమ్మ కొత్త పుస్తకాలకి కవర్లు వేస్తోంది.
చాలా జాగ్రత్తగా…
చిరిగిపోకుండా…
అఖిల్ అడిగాడు:
“అమ్మా… నేను ఫెయిల్ అయితే?”
ఆమె నవ్వి చెప్పింది:
“ఫెయిల్ అవ్వడం తప్పు కాదు నాన్నా…
ప్రయత్నించకుండా వదిలేయడం తప్పు.”
ఆ మాట అతని గుండెల్లో నిలిచిపోయింది.
మరుసటి రోజు నుంచి…
అఖిల్ ఒక పెద్ద టార్గెట్ పెట్టుకోలేదు.
“టాప్ ర్యాంక్ రావాలి” అనుకోలేదు.
కేవలం ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు.
“రోజుకు 3 గంటలు నిజంగా చదవాలి.”
అంతే.
మొదట్లో చాలా కష్టం అనిపించింది.
ఫ్రెండ్స్ బయట ఆడుకుంటున్నారు…
ఫోన్‌లో రీల్స్ ఆకర్షిస్తున్నాయి…
నిద్ర వస్తోంది…
కానీ ప్రతిసారి అతను ఒకటే గుర్తు చేసుకునేవాడు:
“ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే…
మిగతా జీవితం కొంచెం ఈజీ అవుతుంది.”
రోజులు గడిచాయి…
చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి.
మ్యాథ్స్‌లో ఒకప్పుడు 20 మార్కులు తెచ్చుకునే అఖిల్…
ఇప్పుడు 60 తెచ్చుకున్నాడు.
ఇంగ్లీష్‌లో paragraph కూడా రాయకపోయే అఖిల్…
ఇప్పుడు స్టేజ్ మీద answer చెప్పాడు.
టీచర్స్ కూడా ఆశ్చర్యపోయారు.
పబ్లిక్ ఎగ్జామ్స్ రోజు…
హాల్ టికెట్ చేతిలో పట్టుకుని
అతని చేతులు వణికాయి.
అమ్మ దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది:
“నీ కష్టం ఎప్పుడూ వృథా కాదు నాన్నా…”
ఫలితాల రోజు వచ్చింది.
స్కూల్ ముందు అందరూ results చూస్తున్నారు.
అఖిల్ గుండె బలంగా కొట్టుకుంటోంది.
Result చూసి…
అతను ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు.
9.5 GPA
ఒకప్పుడు “నువ్వు చదవలేవ్” అన్న వాళ్లే
ఇప్పుడు అతని దగ్గరకు వచ్చి congrats చెప్పారు.
అఖిల్ మాత్రం ఇంటికి వెళ్లి
అమ్మ చేతిలో result పెట్టి ఏడ్చేశాడు.
“అమ్మా… నేను చేశా…”
ఆమె కళ్లలో నీళ్లు.
“నువ్వు మార్కులు మాత్రమే కాదు నాన్నా…
నీ మీద నీకున్న భయాన్ని గెలిచావ్…”
ఈ స్టోరీలో అసలు మెసేజ్ ఏంటి అంటే —
10th లేదా Inter అనేది కేవలం ఒక క్లాస్ కాదు…
జీవితానికి పునాది వేసే సమయం.
ఈ ఏడాది:
ఫోన్ కంటే future important అని అర్థమయ్యే సంవత్సరం.
Lazyగా ఉంటే dreams దూరమవుతాయని తెలిసే సంవత్సరం.
చిన్న discipline కూడా జీవితాన్ని మార్చగలదని నేర్పే సంవత్సరం.
అందరూ టాపర్స్‌గా పుట్టరు…
కానీ ప్రయత్నించే వాళ్లు మాత్రం తప్పకుండా మారిపోతారు.
**“రోజుకు కొంచెం కష్టపడు…
ఒక రోజు నీ future నీకే thank you చెప్తుంది.”
✍🏻 జెట్టి హిమబిందు ✍🏻
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply