సృష్టికి ముందున్న శివతత్వం

సృష్టి ఏర్పడకముందు కాలం, భూమి, ఆకాశం ఏమీ లేవని హిందూ పురాణాలు చెబుతాయి. ఆ శూన్యంలో ఒక అనంతమైన శక్తి మాత్రమే ఉండేది. ఆ పరమశక్తినే శివుడు అని పిలుస్తారు. అందుకే శివుడిని “స్వయంభూ”, “ఆది అంతం లేని వాడు” అని అంటారు. శివుడు ఎవరి గర్భంలో పుట్టలేదు, ఆయనే విశ్వానికి ముందు నుంచే ఉన్న శక్తి అని పురాణాల భావన.


 త్రిమూర్తుల ఆవిర్భావం 


సృష్టిని నడిపించడానికి పరమశక్తి మూడు రూపాలుగా విభజించబడిందని పురాణాలు చెబుతాయి.

బ్రహ్మ — సృష్టి చేయడానికి

విష్ణువు — ప్రపంచాన్ని కాపాడడానికి

శివుడు — లయం చేయడానికి

ఈ ముగ్గురినీ కలిపి “త్రిమూర్తులు” అంటారు.


 *దేవతల ఆవిర్భావం

పురాణాల ప్రకారం శక్తి లేకుండా దేవుళ్లు అసంపూర్ణం. అందుకే ప్రతి దేవుడికి ఒక శక్తిరూపం ఏర్పడింది. సరస్వతి దేవి జ్ఞానం మరియు విద్యకు ప్రతీకగా బ్రహ్మదేవుని శక్తిగా ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవి సంపద మరియు ఐశ్వర్యానికి ప్రతీకగా విష్ణుమూర్తి శక్తిగా అవతరించింది. పార్వతి దేవి శివుడి శక్తిరూపంగా ఏర్పడింది.


 సతి దేవి నుండి పార్వతి దేవి 


పార్వతి దేవి ముందుగా “సతి దేవి”గా జన్మించిందని పురాణాలు చెబుతాయి. సతి దేవి దక్షుడి కుమార్తె. ఆమె శివుడు ని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ దక్షుడు శివుడిని అవమానించడంతో, ఆ బాధను తట్టుకోలేక సతి దేవి యజ్ఞాగ్నిలో తన ప్రాణాలను త్యాగం చేసింది. తర్వాత అదే శక్తి హిమవంతుడి ఇంట “పార్వతి దేవి”గా మళ్లీ జన్మించింది. ఆమె ఘోర తపస్సు చేసి మళ్లీ శివుడిని వివాహం చేసుకుంది.


శివశక్తి తత్వం

హిందూ తత్వం ప్రకారం శివుడు మరియు శక్తి విడదీయరాని వారు. శక్తి లేకుండా శివుడు నిశ్చలంగా ఉంటాడని, అందుకే “శివుడు శక్తి లేకుంటే శవం” అనే తత్వవాక్యం ఏర్పడింది.

ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవం, ప్రతి కదలిక, ప్రతి శక్తి — అన్నీ శివశక్తి కలయికే అని పురాణాలు చెబుతున్నాయి.


✍🏻 జెట్టి హిమబిందు ✍🏻

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE