ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా?

షిప్ట్‌ డ్యూటీలు, ఎగ్జామ్స్, నచ్చిన సినిమా, లేట్ నైట్‌ పార్టీలంటూ.. ఓవర్‌ నైట్‌ డ్యూటీలు చేస్తున్నారా? ఇలాంటి పనుల వల్ల నిద్రకు సరైన సమయం అంటూ ఏం ఉండదు. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు.. ఎప్పుడు పడితే అప్పుడు టైం దొరికితే చాలు.. నిద్ర పోయేందుకు ఉపక్రమిస్తాం. కానీ ఇలా వేళాపాళా లేని నిద్రతో గుండెపోటు వస్తోందని మీకు తెలుసా?

నిద్ర విషయంలో సరైన టైమింగ్‌ను పాటించకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు మరింత తప్పదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వీలున్నప్పుడు, నైట్ షిప్ట్ చేసి, డే టైం పడుకుంటామంటే కుదరదు. ఇలా నిద్రపోయినా దానివల్ల ఉపయోగముండదు.

మనం ఆరోగ్యంగా ఉండేందుకు సమయానికి నిద్రాహారాలు చాలా ముఖ్యం. క్రమ పద్ధతి లేకుండా తినడం ఎంత ప్రమాదమో.. రోజుకోలా ఒక్కో సమయంలో నిద్రపోవడం వల్ల శరీరంలోని జీవక్రియ క్రమంగా దెబ్బతింటుంది. ఫలితంగా కడుపులో మంట, అధిక రక్తపోటు, గుండె, రక్తనాళాలకు సంబంధించి సమస్యలు రావచ్చు. కాబట్టి మనం ఎంతసేపూ నిద్రపోతున్నామన్నది కాదు. ఎప్పుడు నిద్రపోతున్నామనేదే ముఖ్యమని గుర్తుంచుకోండి.

ప్రతిరోజూ నిలకడగా ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల శరీరం బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. హర్ట్‌ రిలేటెడ్‌ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక వర్కింగ్‌ డేస్‌లో నష్టపోయిన నిద్రను వారాంతాల్లో భర్తీ చేదామనుకుంటారు చాలామంది. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నిద్ర సమయాలను తరచూ మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం సాధ్యం కాకపోగా.. మీ శరీరం బ్యాలెన్స్‌ ఔట్‌ అయిపోతుందని మరవకండి!

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE