- by Ganesh Adla
కొత్త తరహా ఫిట్ నెస్ మంత్ర.. రెట్రో వాకింగ్!
-
- by Ganesh Adla
- in Health
- 0 likes
రెట్రో వాకింగ్ అంటే… సాధారణంగా ముందుకు నడిచే బదులు వెనక్కి నడవడం అన్నమాట. ప్రస్తుతం ఫిట్‌నెస్ మంత్రాగా ఈ రివర్స్ వాకింగ్ ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ఇది శారీరక ఆరోగ్యానికే కాదు… మానసికారోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు రెట్రో వాకింగ్ చేయడం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి. ముఖ్యంగా 30 తర్వాత వచ్చే మోకాళ్ల నొప్పులు, కీళ్లవాతం, తుంటి సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణ నడకతో పోలిస్తే వెనక్కి నడవడం వల్ల కండరాల్లో కొత్త ఉత్తేజం పెరిగి, శరీరం తేలికవుతుంది.
రివర్స్ వాకింగ్, బ్యాక్‌వర్డ్ జాగింగ్ లాంటివి కార్డియో వ్యాయామంలా పనిచేస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ రకం వాకింగ్ వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవడంతో బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. వెనక్కి నడిచేటప్పుడు మన మెదడు మరింత అప్రమత్తంగా పనిచేస్తుంది. దీంతో ఏకాగ్రత పెరగడంతో పాటు నాడీ వ్యవస్థ కూడా చురుకుగా మారుతుంది. ట్రెడ్‌మిల్‌పై కూడా రివర్స్ వాకింగ్ చేయవచ్చు. దీంతో దిగువ కండరాలు బలోపేతమై నడుం నొప్పి తగ్గేందుకు సాయపడుతుంది. రోజూ ఉదయం కేవలం 10 నిమిషాలు రెట్రో వాకింగ్ చేయడం వల్ల శ్వాసకోశ పనితీరు మరింత మెరుగుపడుతుంది. ఇదే అలవాటుగా మారితే ముందుకు నడిచే వేగం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా శరీర భంగిమ సరిగా మారి, నిలబడే తీరు మెరుగవుతుంది.
రెట్రో వాకింగ్ వల్ల ప్రతిరోజూ ఒకే విధంగా పనిచేసే కండరాలకు కొత్త ఉత్సాహం లభిస్తుంది. అందుకే ఫిట్‌నెస్ నిపుణులు కూడా దీనిని మంచి వ్యాయామంగా సూచిస్తున్నారు. మీరు ట్రై చేయండి. మొదట్లో నెమ్మదిగా, సురక్షితమైన ప్రదేశంలో మాత్రమే రెట్రో వాకింగ్ ప్రారంభించాలని గుర్తుంచుకోండి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply