- by Ganesh Adla
తులసి చెట్టుని మనం ఇంట్లో ఎందుకు పూజిస్తాము?
-
- by Ganesh Adla
- in Health
- 0 likes
హిందూ పురాణాల ప్రకారం తులసి దేవిని “వృందా దేవి”గా భావిస్తారు. ఆమెను శ్రీ మహావిష్ణువు కి అత్యంత ప్రియమైనదిగా చెబుతారు. అందుకే విష్ణుమూర్తి, కృష్ణుడి పూజలో తులసి దళం లేకుండా పూజ పూర్తికాదని అంటారు. మన తాతలు మన పెద్ద వాళ్ళు అంతా కూడా అప్పట్లో ఒక మాట అంటూ ఉండేవారు. ఇంట్లో తులసి ఉంటే ఆ ఇంట్లో పవిత్రత ఉంటుంది. అది కేవలం భక్తి కాదు మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక దృఢ నమ్మకం
ఆరోగ్య పరంగా చూస్తే
ఇప్పుడు సైన్స్ కూడా చెబుతోంది తులసి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క అని. నీ తులసి చెట్టు వలన
గాలి శుభ్రపడుతుంది
దోమలు, క్రిములు కొంతవరకు దూరమవుతాయి
జలుబు, దగ్గు, జ్వరంలో కూడా ఉపయోగపడుతుంది
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అంటే మన పెద్దవాళ్లు పూజ పేరుతో నిజానికి ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు.
తులసిని అమ్మవారిలా ఎందుకు చూస్తారు అంటే
మన సంస్కృతిలో ప్రాణం ఇచ్చేది ఎవరు దైవమే కదా మరి తులసి చెట్టు అంటే ఆరోగ్యమే కదా అంటే తొలిచూచటం మన ఇంట్లో ఉన్న ఆమె గాలి తగిలినా లేదంటే ఆమెనే మనం రోజు పొద్దున్నే కొంచెం పరుగు అనుకున్న అది మనకి ఆరోగ్యం ఏ కదా సో మనకి ఆ ఆరోగ్యాన్ని తులసి చెట్టు ఇస్తుంది
గాలిని శుభ్రం చేస్తుంది మనసుకు ప్రశాంతత ఇస్తుంది
అందుకే ఆమెను ఒక ఒక దేవతలో పూజిస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా మనకు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడినప్పుడు వాళ్లు మనకు చేసే సహాయాన్ని గుర్తుంచుకొని నాకు ఒక దేవుడిలో వచ్చి హెల్ప్ చేస్తామని కాబట్టి ఆమెను మనం ఒక దైవంగా పూజిస్తున్నాము.
మనకు ఉపయోగపడే దాన్ని కృతజ్ఞతతో మనం గౌరవించాలి
పూర్వకాలంలో ఇంటి ముందు తులసి ఉండటం అంటే ఓహో
ఈ ఇంట్లో ఇంకా మంచితనం బ్రతికే ఉంది అని ఒక సంకేతం
అందుకే తులసి మొక్కను కేవలం మొక్కగా కాదు
ఇంటి ఊపిరిగా చూస్తారు.
✍🏻 జెట్టి హిమబిందు ✍🏻
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply