- by Ganesh Adla
శ్రీకృష్ణుడు ఎందుకు నీలంగా ఉంటాడు?
-
- by Ganesh Adla
- in Devotional
- 0 likes
నాకు తెలుసు చాలామందికి ఈ డౌట్ ఉండే ఉంటది, చాలా మందికి ఈ విషయం తెలుసుకోవాలని ఆత్రుత ఉంటది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఎందుకు నీలంగా ఉన్నాడు, అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, అండ్ అలానే మన భగవద్గీతలో కూడా దీనికి ఆన్సర్ ఉంటది నాకు తెలిసినంతవరకు శ్రీకృష్ణుడు ఎందుకు నీలంగా ఉంటాడు అంటే దానికైతే ఒక ఆన్సర్ లేదు ఆధ్యాత్మికంగా పురాణాల ప్రకారం అయితే ఆకాశము రంగు నీలమే అండ్ అలానే సముద్రం రంగు నీలమే. సో ఆకాశంలో సముద్రంతో ఎందుకు పోల్చారు అంటే ఆకాశం అనేది అనంతమైనది ఇంక సముద్రం అంటే అపారమైనది. అనంతమైనది అంటే ఏంటో తెలుసా అపారమైనది. అంటే ఏంటి అంటే మనం కొలవలేనటువంటిది అన్నమాట అంటే సముద్రం చాలా పెద్దది దాన్ని మనం కొలవగలమా? కొలవలేము సో వీటి రెండిటితోనే ఎందుకు పోల్చారు అంటే శ్రీకృష్ణుడి యొక్క చైతన్యం కూడా అనంతమని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా అనమాట ఒక ఉదాహరణగా తీసుకున్నారు.
ఆదాయాన్ని అంటే శ్రీకృష్ణుడి యొక్క చైతన్యము అనంతమైనదే అని చెప్పటానికి దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు, అండ్ అలానే దేవుడు ఒక మనిషి మాత్రమే కాదు అనంతమైన శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్పడానికి అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పురాణాల్లో శ్రీకృష్ణుడిని వర్షం తీసుకొచ్చి నల్లని మేఘంలాగా అంటే నేల మేఘశ్యాముడు అని చెప్పి వర్ణిస్తాడు. ఎందుకు అంటే మేఘం భూమికి జీవం వస్తుంది కదా అలాగే కృష్ణుడు కూడా ప్రేమ ధర్మం జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడని భావిస్తారన్నమాట. ఇంకొకటి ఆసక్తికరమైన ఆ భావన ఏంటి అంటే కొంతమంది యోగులు ఈ విధంగా కూడా చెప్తారు. ఏంటంటే మన శరీరంలో ఒక విశుద్ధ చక్రం అనేది ఉంటుంది అంటే త్రోట్ చక్రా అని అంటారు కదా అది ఉందన్నమాట అది మన శరీరంలోనే ఉంది అది నీలం రంగులతో సంబంధం అయి ఉందంటది.
నీలం రంగుతోనే ఉంటుందంట అంటే అది సత్యం సంగీతం వ్యక్తీకరణ దివ్యజ్ఞానం కి ప్రతీక శ్రీకృష్ణుడు అన్నమాట సో వేణు వాయించేవాడు గీతం ఉపదేశించినవాడు ప్రేమను బోధించిన వాడు కాబట్టి నీలం రంగుతో చూపించాలి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. టోటల్గా కృష్ణుడికి నీలం రంగు అంటే కేవలం అది స్కిన్ కలర్ కాదు అంటే శరీరం యొక్క రంగు మాత్రమే కాదు, అది అపారమైన ప్రేమ అనంతమైన చైతన్యం ఆకాశంలోంటి విశాల హృదయంకి ప్రతికగా చూపించినారు అన్న మాట.
✍🏻 జెట్టి హిమబిందు ✍🏻
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply