'ఎండలు' ఎందుకు ఇలా మండిపోతున్నాయి? కారణం ఇదే!

ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎండలు కేవలం “సమ్మర్ వచ్చింది” అన్నంత సింపుల్ విషయం కాదు. ప్రకృతి చాలా నెమ్మదిగా మనకు సంకేతాలు ఇస్తోంది… కానీ మనుషులు వాటిని పట్టించుకోకుండా పోయారు. అందుకే ఇప్పుడు ఎండలు ఇలా మండిపోతున్నాయి. ☀️మనం చిన్నప్పుడు లేదా 15–20 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. మే నెలలో కూడా చెట్టు కింద కూర్చుంటే చల్లగా ఉండేది… ఇప్పుడు ఫ్యాన్ గాలి కూడా వేడిగా అనిపిస్తోంది. దానికి కొన్ని పెద్ద కారణాలు ఉన్నాయి.


🌍 ఎండలు ఎందుకు ఇంత పెరిగిపోయాయి? (Scientific Reasons)


1. 🌡️ గ్లోబల్ వార్మింగ్ (Global Warming)


ఇది ప్రధాన కారణం. మన భూమి చుట్టూ ఒక గాలి పొర ఉంటుంది. దాన్ని atmosphere అంటారు. కార్లు, ఫ్యాక్టరీలు, కాలుష్యం వల్ల, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, పొగ లాంటివి ఎక్కువైపోతున్నాయి. ఇవి భూమి వేడిని బయటికి పోనివ్వకుండా బంధిస్తాయి. దాంతో భూమి రోజురోజుకీ వేడెక్కుతోంది. ఇది ఒక గదిలో ఫ్యాన్ ఆపేసి తలుపులు మూసేసినట్టే. 🥵


2. 🌳 చెట్లు తగ్గిపోవడం


ఇది చాలా పెద్ద కారణం

మునుపు:

గ్రామాల్లో పెద్ద చెట్లు ఉండేవి, పొలాలు ఉండేవి, గాలి చల్లగా తిరిగేది

ఇప్పుడు:

చెట్లు నరుకుతున్నారు, కాంక్రీట్ బిల్డింగ్స్ పెరిగాయి. రోడ్లు, సిమెంట్, టార్లు వేడిని నిల్వ చేసుకుంటున్నాయి. చెట్టు ఒక సహజ AC లాంటిది. 🌿 అది లేకపోతే భూమి నేరుగా మండిపోతుంది.


3. 🏙️ Urban Heat Effect


సిటీల్లో ఎందుకు ఎక్కువ వేడి అనిపిస్తుందో తెలుసా?

కాంక్రీట్, ఇనుము, గాజు భవనాలు ఇవి పగలు వేడిని పీల్చుకుని రాత్రికి కూడా వేడిచేస్తుంటాయి. అందుకే ఇప్పుడు రాత్రులు కూడా చల్లగా ఉండట్లేదు.


4. 🌧️ వర్షాలు సరిగ్గా పడకపోవడం.,


మునుపు కాలాలు సరిగ్గా ఉండేవి:

సమయానికి వర్షం, సమయానికి చలి, సమయానికి ఎండ. ఇప్పుడు climate imbalance వచ్చేసింది.

ఎక్కడో వరదలు…

ఎక్కడో తీవ్ర ఎండలు…

ఎక్కడో మంచు కరుగుతోంది…

ప్రకృతి cycle disturb అయింది.


🌞 ఒక పాత పురాణ భావన కూడా ఉంది.


మన పెద్దలు ఒక మాట చెప్పేవారు: “భూమాత కోపిస్తే సూర్యుడు మంట పెడతాడు.” అంటే ప్రకృతిని మనుషులు నాశనం చేస్తే, ప్రకృతి కూడా తన శక్తిని చూపిస్తుంది అని భావన. అందుకే పాతకాలంలో: నదులను దేవతలుగా చూశారు. చెట్లను పూజించారు. భూమిని తల్లిగా భావించారు. ఎందుకంటే వాళ్లకు ప్రకృతి విలువ తెలుసు.


😔 ఇప్పుడు ఎందుకు భయంకరంగా అనిపిస్తోంది?

ఎందుకంటే, 40°C సాధారణం అయిపోయింది. Heat waves ఎక్కువయ్యాయి. ACలు పెరగడం వల్ల బయట వేడి ఇంకా పెరుగుతోంది. నీటి కొరత వస్తోంది. ఇది కేవలం “వేసవి” కాదు చిన్ను… ఇది climate change అనే పెద్ద హెచ్చరిక.


🌿 మనం చేయగల చిన్న చిన్న పనులు,


ఒక్క చెట్టు నాటినా విలువ ఉంది unnecessary గా ప్లాస్టిక్ కాల్చకూడదు. నీళ్లు వృథా చేయకూడదు. ఇంటి దగ్గర మొక్కలు పెట్టాలి. మధ్యాహ్నం జంతువులకు నీళ్లు పెట్టాలి 🐦💧


ప్రకృతి మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది, ఇప్పుడు మనం ప్రకృతిని కాపాడాల్సిన సమయం వచ్చింది. 🌱


✍🏻 జెట్టి హిమబిందు ✍🏻

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE