పరభాషా నటులుతో పాన్ ఇండియా సినిమాలు

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటున్నాయి. ప్రధాన విలన్ పాత్రలకు పరభాష యాక్టర్స్ ను పరిచయం చేసిన ఘనత మన టాలీవుడ్ కు చెందుతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మన టాలీవుడ్ లో గతంలో అనేక సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రంలో కూడా మోహన్ లాల్ నటిస్తారని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి ప్రేక్షకులు విధితమే. ఈ సినిమా తర్వాత 'నాంది' దర్శకుడు కనకమేడల విజయ్ తన సినిమాలో కూడా మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏఎన్ఆర్, బాలయ్య కలిసి నటించిన 'గాండీవం' సినిమాలో మోహన్ లాల్ ఒక పాటలో నటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' లో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన విషయం తెల్సిందే.

author

vamsi

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE