- by Sandeep
పోలీస్‌స్టేషన్‌లో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
Jul 20, 2026,
పోలీస్‌స్టేషన్‌లో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
తెలంగాణ : ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేశాడు. కుటుంబ కలహాలతో రజని, రాంబాబు దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. డ్వాక్రా రుణం చెల్లించేందుకు బ్యాంకుకు వచ్చిన భార్యతో రాంబాబు ఘర్షణకు దిగాడు. బ్యాంకు వద్ద భర్త కొట్టాడని ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు రజని వెళ్లింది. పోలీసులకు తనపై ఫిర్యాదు చేసిందని కోపంతో రాంబాబు పీఎస్‌లోనే భార్యను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని పోలీసులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply