- by Sandeep
ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: సీఎం చంద్రబాబు
ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: సీఎం చంద్రబాబు
ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభ తేదీ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని, రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. శనివారం ఎయిర్‌పోర్టు పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రకు ఈ విమానాశ్రయం ఒక మణిహారమని, ఇది సరికొత్త అవకాశాలను తెస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply