ఆన్‌లైన్ వ్యభిచారం పేరుతో వల.. బెంగళూరులో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

బెంగళూరు: ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ యాప్‌లలో వ్యభిచారం ప్రకటనలు పెట్టి కస్టమర్లను వలలో వేసి, నిర్దేశిత ప్రాంతాలకు పిలిపించి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను బెంగళూరు సీసీబీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఓ వ్యక్తి యాప్‌లో వచ్చిన ప్రకటనకు స్పందించగా, నిందితులు పంపిన లైవ్ లొకేషన్ మేరకు హెచ్‌బిఆర్ లేఅవుట్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు మహిళలను చూపిస్తూ మాటల్లో పెట్టి, అనంతరం అతనిపై దాడి చేసి నగదు, మొబైల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కేజీ హళ్లి పోలీసులు, సీసీబీ మహిళా సంరక్షణ విభాగం సహకారంతో దర్యాప్తు చేపట్టి జూలై 17న దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 ఆటోరిక్షాలు, 4 ద్విచక్ర వాహనాలు, 13 మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను బెంగళూరుకు తీసుకొచ్చి, వారి ఫోటోలను ఆన్‌లైన్ యాప్‌లలో అప్‌లోడ్ చేసి ఈ దందా నిర్వహిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రజలకు హెచ్చరిక: సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్‌లో కనిపించే అక్రమ వ్యభిచార ప్రకటనలను నమ్మి స్పందించవద్దని, అనుమానాస్పద ప్రకటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని బెంగళూరు సిటీ పోలీసులు సూచించారు.

author

Hari

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE