- by Sandeep
హైదరాబాద్ ఇనాంగూడ బ్రిడ్జిపై బోల్తా పడిన టమాటా లారీ
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఇనాంగూడ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటాలతో వెళ్తున్న ఒక డీసీఎం (DCM) వాహనం, టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. లారీలో ఉన్న టమాటాలను సిబ్బంది మరో వాహనంలోకి మార్చారు. ప్రమాదం జరిగిన వాహనం రహదారికి అడ్డంగా ఉండటంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply