- by Sandeep
రేవంత్ రెడ్డి పాలనలో కరువు: జగదీష్ రెడ్డి
రేవంత్ రెడ్డి పాలనలో కరువు: జగదీష్ రెడ్డి
తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం కరువు పరిస్థితులను ఎదుర్కొంటుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరువును ఎదుర్కోవడంలో విఫలమైందని, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలోని నీళ్లు ఖాళీ అవుతాయని, గోదావరి నీటిని వాడుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదని ఆరోపించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply