బద్ధశత్రువుల మధ్య 'బలమైన' స్నేహం? నిజం ఎంత.?

రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు అనడానికి తమిళనాడు రాజకీయాలలో తాజా పరిస్థితులే దీనికి నిదర్శనం. నిన్నటి వరకు నువ్వా-నేనా అని తలపడిన అటువంటి పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి చేతులు కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.


దశాబ్దాలుగా తమిళనాడును శాసించిన ద్రావిడ పార్టీలకు ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు విజయ్ (TVK) రాకతో ఏర్పడిన కొత్త రాజకీయ సమీకరణాలు, మరోవైపు జాతీయ పార్టీలైన BJP, కాంగ్రెస్‌ల ప్రమేయం లేకుండా సొంతంగా చక్రం తిప్పాలనే పట్టుదల ఈ కలయికకు పునాది వేస్తోందని తెలుస్తుంది.


డీఎంకే సంఖ్యా బలం: (59) + అన్నాడీఎంకే (47) కలిస్తే, ఇతర చిన్న పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని సునాయాసంగా దాటే అవకాశం ఉంది. ఢిల్లీ పెత్తనం లేకుండా రాష్ట్ర రాజకీయాలను తామే శాసించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయల పై మెరిసిన దళపతి విజయ్ కి గవర్నర్ నుంచి ఎదురుదెబ్బ తగలడం బీజేపీ అనుకూల వర్గం ఆసక్తికరం. కాంగ్రెస్‌తో జతకట్టినా, 112 మంది మాత్రమే ఉండటంతో, మ్యాజిక్ ఫిగర్‌కు మరో 6 మంది తక్కువయ్యారు.


రాజకీయ విశ్లేషణ: విజయ్ రెండు సీట్లలో గెలవడం వల్ల ఒక సీటును రాజీనామా చేయడం ఆయన బలాన్ని 107కు తగ్గించింది. అంచనాలు తప్పడంతో ఇప్పుడు చిన్న పార్టీల మద్దతు కోసం విజయ్ వేచి చూడాల్సి వస్తోంది. సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటి? మరి పార్టీ జెండాల మోసిన, నాయకుల విగ్రహాల కోసం వీధుల్లో కొట్లాడుకునే కార్యకర్తలు సామాన్య కార్యకర్త ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు.


నిన్నటి వరకు తిట్టుకున్న నాయకులు ఇవాళ కుర్చీ కోసం కౌగిలించుకుంటుంటే, వారి కోసం కేసులు వేయించుకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? చంద్రబాబు-మోదీ కలయికను ఉదాహరణగా చూపిస్తూ, తమిళ రాజకీయాల్లోనూ ఇదే సీన్ రిపీట్ కావడం "రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు" అనుకోవడానికి మరోసారి రుజువు చేస్తోంది. స్టాలిన్ అనుభవం, పళనిస్వామి వ్యూహాలు కలిస్తే అసాధ్యం సుసాధ్యం కావచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకులు ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మరిది తమిళనాడు ఇప్పుడు ఒక రాజకీయ చారిత్రాత్మక మార్పుకు కానుందా?


సిద్ధాంతాలు పక్కన పెట్టి, సంఖ్యా బలం కోసం చూస్తున్న ఈ ప్రయాణంలో అంతిమంగా విజేతగా నిలిచేది ఎవరనేది మరికొన్ని గంటల్లో కలిసిపోనుంది. ఈ పరిణామాలు నిజమైతే, తమిళనాడులో జాతీయ పార్టీల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోవచ్చని మళ్ళీ రీజనల్ పాలిటిక్స్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. సక్సెస్ అవుతుందంటారా? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో మరి కొన్ని గంటలలో తెలిసిపోనుంది.

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE