- by Sandeep
కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో గాయని ఎస్ జానకి అంతక్రియలు
ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి అంత్యక్రియలు కర్ణాటకలోని మైసూర్ నగరంలోని జానకి తోటలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కర్ణాటక ప్రభుత్వం అధికారిక గౌరవాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికింది.
బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ, సంగీత రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు హాజరై ఎస్. జానకికి నివాళులర్పించారు.
దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఎస్. జానకి మరణం సంగీత లోకానికి తీరని లోటుగా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply