- by Sandeep
గంగాపూర్ ZPHSలో ఘనంగా యోగా దినోత్సవం
జడ్చర్ల మండలంలోని గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, SI క్రాంతి కుమార్,విద్యార్థులు, హెల్పింగ్ హార్ట్, సభ్యులు కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పలు యోగాసనాలు ప్రదర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో SI క్రాంతి కుమార్,పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, హెల్పింగ్ హార్ట్ సభ్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply