- by vamsi
సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్న 'దురంధర్'
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ డైరెక్షన్లో వచ్చిన 'దురంధర్' సినిమా భారతీయ సినీ పరిశ్రమంలోనే ఒక సంచలనం సృష్టించింది. ఇంతవ...
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ డైరెక్షన్లో వచ్చిన 'దురంధర్' సినిమా భారతీయ సినీ పరిశ్రమంలోనే ఒక సంచలనం సృష్టించింది. ఇంతవరకు ఉన్న ఫిలిం రికార్డులను బద్దలు కొట్టిన చిత్రం దురంధ్రేనని ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలు కలిపి 3000 కోట్లు పైగా కలెక్షన్ సాధించుకున్నాయి. పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా రెండు భాగాలు కలిపి 2,438 కోట్ల రూపాయలు వసూలు చేయగా, పుష్ప రెండు భాగాలు కలిపి 1,742 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్లు తెలుస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టిన చిత్రంగా దురంధర్ నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాల స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply