- by vamsi
మొదటిసారి ఎమ్మెల్యే అయితే బీపీ, రెండోసారి ఎమ్మెల్యే అయితే షుగర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వైసిపి పార్టీ సత్తా చాటుతుందని మాజీ మంత్రి వైసిపి నాయకురాలు ఆర్కే రోజా గంటాపదంగా...
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ వైసిపి పార్టీ సత్తా చాటుతుందని మాజీ మంత్రి వైసిపి నాయకురాలు ఆర్కే రోజా గంటాపదంగా చెప్పారు. గత వైసిపి పాలనలో చాలా అభివృద్ధి పనులు చేపట్టమన్నారు. వైసీపీ సర్పంచులు గర్వంగా పనులు చేసి చూపించారని ఆమె చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు మానసిక ఒత్తిళ్లు కలిగిస్తున్నవి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ సమస్య వచ్చిందని రెండోసారి షుగర్ సమస్య అధికమైందని రోజా తన ఆరోగ్య పరిస్థితి వివరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ప్రజాబలమే మళ్ళీ గెలిపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వైసిపి పార్టీ శ్రీకారం చుట్టినా సంగతి ప్రజలందరికీ తెలుసని రోజా వివరించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply