- by vamsi
'పెద్ది'లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్!
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం 'ప...
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం 'పెద్ది'. హీరో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'పెద్ది' చిత్రంలో పహిల్వాన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఈ సినిమా పై క్రేజ్ పెరుగుతుంది. అయితే ఈ గ్లిoప్స్ పై సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఒకసారి చెవికి ముక్కుకి పోగులతో రామ్ చరణ్ కనిపించారు. ఇటీవల పహిల్వాన్ గెటప్ లో అలాంటి లుక్కు కనిపించలేదు దీంతో ప్రేక్షకుల్లో సందేహం నెలకుంది. హీరో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా? తండ్రి కొడుకులుగా కనిపిస్తారా? లేదా ఒక పాత్రలో క్రికెటర్ గా, ఇంకో పాత్రలో రైజర్లుగా కనిపిస్తారా అనేది సినిమా విడుదలైన అంతవరకు సస్పెన్స్. ఈ చిత్రం కోసం హీరో రామ్ చరణ్ ఐదు నెలల పాటు శిక్షణ పొందినట్లు తెలుస్తుంది. హీరో రామ్ చరణ్ తన నటిస్తున్న 'పెద్ది' చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply