- by vamsi
'రౌడీ జనార్ధన' ఇంటర్వెల్ బ్యాంగు.. పోతారు మొత్తం పోతారు
నటుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపు దిద్దుకుంటున్న చిత్రం 'రౌడీ జనార్ధన'. ఈ సినిమా మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచ...
నటుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపు దిద్దుకుంటున్న చిత్రం 'రౌడీ జనార్ధన'. ఈ సినిమా మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తొలిసారిగా తన కెరీర్ లోనే ఊర మాస్ క్యారెక్టర్ ను చేస్తున్నారు. గ్లింప్స్ చూసిన అభిమానులు ఈ సినిమాపై భారీగా ఆశలు పెంచుకుంటున్నారు. చాలా కాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ కు ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు రవికిరణ్ కోలా రౌడీ జనార్ధనగా డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని సినీ వర్గాల టాక్. ఈ మూవీ కోసం భారీగా ఇంటర్వెల్ బ్యాంగును దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది అభిమానులు పేర్కొంటున్నారు. 1980లో జరిగిన ఒక్క యథార్థ సంఘటన ఆధారంగా రౌడీ జనార్ధన చిత్రం రూపుదిద్దుకుంటుందని దర్శకుడు తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply