- by vamsi
సొంత వదినపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరోయిన్ హన్సిక
గృహహింస ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని సినీనటి హన్సిక, టీవీ నటుడు ముస్కాన్ పై రెండు కోట్ల రూపాయలు పరువు నష్ట దా...
గృహహింస ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని సినీనటి హన్సిక, టీవీ నటుడు ముస్కాన్ పై రెండు కోట్ల రూపాయలు పరువు నష్ట దావా వేశారు. తనపైనే కాకుండా తన సోదరుని కూడా కలిపి ముస్కాన్ గృహహింస ఆరోపణ చేయడం తమ ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపిస్తూ ముంబై కోర్ట్ ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ప్రకారం వివాహ సమయంలో ముస్కాన్ 27 లక్షలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్కాన్ తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయకుండా నిలువరించాలని కోర్టును కోరారు. ఇదే విషయంలో గతంలో కూడా ముంబై కోర్టును ఆమె ఆశ్రయించడం ప్రేక్షకులకు విధితమే. త్వరలో ఈ కేసు విచారణకు రానుంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply