- by vamsi
నటి విష్ణు ప్రియకు కలిసి వచ్చిన వివాదం
బిగ్ బాస్ ఫేమ్, టీవీ యాంకర్ ను ప్రోత్సహిస్తున్నట్లు విజయవాడ ఏఐఎస్ఎస్ నేతలు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింద...
బిగ్ బాస్ ఫేమ్, టీవీ యాంకర్ ను ప్రోత్సహిస్తున్నట్లు విజయవాడ ఏఐఎస్ఎస్ నేతలు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో నటి విష్ణు ప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా చూసే వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా 26 లక్షలు పైగా పెరిగింది. గతంలో ఆమె ఖాతాకు 1,892 మంది సబ్స్క్రైబర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య అధికం కావడంతో ఆమెకు లక్షల్లో ఆదాయం వస్తుంది. ఒక్కోసారి నెగిటివ్ ప్రచారం కూడా కలిసి వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. విష్ణు ప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏం అప్లోడ్ చేసిందోనని సోషల్ మీడియా వీక్షకులు ఆసక్తి చూపడంతో ఆమె ఆదాయం లక్షల్లో పెరిగినట్లు సమాచారం. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వారు, ఇలా నైతిక విలువలు పాటించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కోసారి నెగిటివ్ ప్రచారం కూడా పాజిటివ్ ఫలితాలు ఇస్తుందనేది నటి విష్ణు ప్రియ విషయంలో జరిగింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply