మహిళలే దేశానికి అసలైన బలం మున్సిపాలిటీ, వైస్ చైర్మన్-గీతఆచారి

మహిళలే మన ఇళ్లకు, దేశానికి అసలైన బలం. 2014లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడినప్పటి...

మహిళలే మన ఇళ్లకు, దేశానికి అసలైన బలం. 2014లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడినప్పటి నుంచి దేశంలో నిజమైన మార్పు మొదలైంది. ఉజ్వల యోజనతో వంటగదిలో భద్రత, స్వచ్ఛ భారత్‌తో ఆత్మగౌరవం, పీఎం ఆవాస్ యోజనతో సొంతింటి హక్కు.. ఇలా ప్రతి అడుగులోనూ మహిళలకు ఒక స్పష్టమైన గుర్తింపు లభించింది. నేడు మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు, గతంలో కంటే ఉన్నతమైన కలలు కంటున్నారు. ఇప్పుడు 'నారీ శక్తి వందన్ అధినియమ్' ద్వారా కల్పించిన 33% రిజర్వేషన్‌తో మహిళలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా, చట్టసభల్లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారు. మహిళల ప్రయాణాన్ని ఆత్మగౌరవం నుంచి ఆర్థిక స్వాతంత్రం వైపు, అక్కడి నుంచి నాయకత్వం వైపు నడిపిస్తున్న మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. - శ్రీమతి తల్లోజు గీతా ఆచారి గారు, ఆమనగల్ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్.

author

Sandy

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE