- by Ganesh Adla
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఇద్దరికి గాయాలు!
-
- by Ganesh Adla
- in National
- 0 likes
ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగినట్లు సమాచారం. ముంబైలోని జుహు ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నటుడి డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం.
కాల్పుల ఘటనలో నటుడు టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మరోవైపు, ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ప్రకటన వెలువడినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా ప్రచారంలోకి వచ్చింది.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కాల్పుల వెనుక కారణాలు, నిందితుల వివరాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply