ఆమనగల్లులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగడి బజార్‌ – హనుమాన్ దేవాలయం వద్ద పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ తల్లోజు గీతా ఆచారి

ఆమనగల్లు: పట్టణంలోని అంగడి బజార్‌ – హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి తల్లోజు గీతా ఆచారి పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకల్లో ఆమె పాల్గొని సందడి చేశారు.

మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. సద్దుల బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది.

author

Shivashankar Gampala

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE