- by Ganesh Adla
స్థానిక సంస్థల ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-
- by Ganesh Adla
- in National
- 0 likes
కంట్రోల్ రూమ్ నంబర్లు: 08647-224455, 08647-252999
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు, ఎన్నికల సమయంలో అందే ఫిర్యాదులను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకునేందుకు ఎన్నికల నియంత్రణ కేంద్రాన్ని (Control Room) ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
ఈ నియంత్రణ కేంద్రం ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు లేదా సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలియజేయవచ్చు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply