దర్దేపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలు.. మహిళలతో కలిసి ఆడిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనగామ జిల్లా: పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని, గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు.

రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి బతుకమ్మ పండుగ నిదర్శనమని తెలిపారు. ఇలాంటి పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

గ్రామ మహిళలు ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

#సద్దులబతుకమ్మ #యశస్వినిరెడ్డి #పాలకుర్తి #జనగామజిల్లా #తెలంగాణవార్తలు#SM2NEWS#sm2newsapp #Sm2news App



author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE