కోహ్లీ క్యాచ్ వదిలేసి మూల్యం చెల్లించాం: ఓటమిపై కెప్టెన్ గిల్

ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్ జారవిడచడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని గిల్ అభిప్రాయపడ్డాడు. "ఒక బ్యాటర్ సున్నా వద్ద ఉన్నప్పుడు క్యాచ్ వదిలేస్తే ఫీల్డర్‌కు చాలా కష్టంగా ఉంటుంది. కానీ దాని నుంచి ఎలా పుంజుకున్నామన్నదే ముఖ్యం. ఆ క్యాచ్ తర్వాత కోహ్లీ అద్భుతంగా ఆడాడు" అని అన్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ 44 బంతుల్లో 81 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

author

Hari

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE