- by vamsi
దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉండాలి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి రాజకీయంగా ప్రాబల్యూము కోల్పోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్...
పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి రాజకీయంగా ప్రాబల్యూము కోల్పోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన లోకసభ నియోజకవర్గాల పునర్ విభజన అంశంపై రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం. సిద్ధ రామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. అన్ని రాష్ట్రాల వారు కలిసి కట్టుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి కోరారు. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ అందరికంటే ముందు ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన ఈ విషయంలో మనమంతా ఏకం అవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply