డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.29.17 లక్షల మోసం.. ఇద్దరు అరెస్ట్!

హైదరాబాద్: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి రూ.29.17 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ పోలీస్, సీబీఐ, ఈడీ అధికారులమంటూ అమీర్‌పేటకు చెందిన రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. రూ.6.8 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామని బెదిరించి, వెరిఫికేషన్ పేరుతో బాధితుడు, ఆయన కుమార్తె నుంచి రూ.29.17 లక్షలు బదిలీ చేయించుకున్నారు.

ఈ కేసులో అమీర్‌పేటకు చెందిన మొహమ్మద్ అష్ఫాక్ హుస్సేన్, అహ్మద్ నజీబ్ ఉద్దీన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సచిన్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో మోసపూరిత సొమ్మును మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించినట్లు వెల్లడైంది. చెక్కుల ద్వారా నగదు విత్‌డ్రా చేసి ఇతర ఖాతాల్లో జమ చేయడంతో పాటు, USDT క్రిప్టోకరెన్సీ లావాదేవీలతో డబ్బు ఆనవాళ్లు దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో నిందితులు కమీషన్లు పొందినట్లు దర్యాప్తులో తేలింది.

ప్రజలకు సూచన: పోలీసులమని, సీబీఐ లేదా ఈడీ అధికారులమని ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు బదిలీ చేయాలని కోరితే నమ్మవద్దు. డిజిటల్ అరెస్ట్ పేరుతో చేసే బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండండి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి. https://play.google.com/store/apps/details?id=com.kanagalatech.sm2news #HYD #Hyderabad

#sm2newsapp #sm2news #DigitalArrest #CyberCrime #Hyderabad #CyberFraud #TeluguNews

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE