- by Ganesh Adla
కూకట్‌పల్లి లులు మాల్‌లో కలకలం.. కిట్‌క్యాట్ చాక్లెట్‌లో పురుగులు ఉన్నాయంటూ ఫిర్యాదు!
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్‌లో పురుగులు కనిపించినట్లు ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పిల్లల కోసం కొనుగోలు చేసిన చాక్లెట్‌లో పురుగులు కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేసినట్లు సదరు కస్టమర్ తెలిపారు. చాక్లెట్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టేనా?
ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ జరిపి, చాక్లెట్ నాణ్యతను పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. అటు సంబంధిత కంపెనీ, లులు మాల్ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply