గణపవరం వెలమపేటలో ఘనంగా సామూహిక శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతాలు.

గణపవరం, సెప్టెంబర్,4. స్టేట్ టైమ్స్,వెటరన్ జర్నలిస్ట్ జి అప్పారావు. స్థానికమండలానికి చెందిన గనపవరం లోని వెలమపేటలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని స్త్రీ సమూహములతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఉంగుటూరు నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాసరావు, కళ్యాణ్ రామ్ ల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వ్రతాలలో పాల్గొన్న సుమారు 100మందిస్త్రీశక్తినారీమణులకు 

 లక్ష రూపాయల విలువైన 

పూజా సామాగ్రిని అందించామని వారుతెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గ

 దాని పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో ఆడపడుచులంద రు  ఆయురారోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను, సిరి సంపదలతోనూ, సుఖంగా ను సంతోషంగా ను ఉండాలనే సదుద్దేశ్యంతొ ఈ ప్రత్యేక సామూహిక వరలక్ష్మి పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు వారు తెలిపారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బొడె రామచంద్ర యాదవ్ ఆలోచనలతో సనాతన ధర్మాన్ని, మన సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశ్యముతో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వారు తెలియజేశారు. గణపవరం చుట్టుప్రక్కల ఉన్న ఆడపడుచులు మాట్లాడుతూ ఈ వ్రతంలో పాల్గొనడం ఎంతో సంతోషంగాఆనందంగాఉందని 

ఇలాంటి మంచి కార్యక్రమాలు

నిర్వహించిన కన్వీనర్ సూర్రెడ్డి శ్రీనివాసరావునకు గణపవరం వెలమ పేటకు చెందిన ఆడపడుచు లందరూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ సభ్యుడు పంది రాంబాబు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నల్లజర్ల నాగ వెంకట రామారావు, టీఎస్ఎం కుమార్, గ్రామ పెద్దలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముగింపు చేశారు.

author

Hari

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE