కర్రెగుట్టలలో ల్యాండ్‌మైన్ పేలుడు: గిరిజనుడి మృతి.!

తెలంగాణ: ములుగు జిల్లాలోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చినట్లు అనుమానిస్తున్న ల్యాండ్‌మైన్ పేలడంతో ఒక గిరిజనుడు మరణించాడు. దుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు వెదురు కర్రల సేకరణ కోసం కొండపైకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

పేలుడు తీవ్రత కారణంగా నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author

vamsi

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE