- by Hari
మంత్రిపదవి నుంచితనను తొలగించడంపై కొండాసురేఖ తీవ్ర ఆగ్రహంవ్యక్తం..!
సురేఖ సంచలన వ్యాఖ్యలు.. అధిష్ఠానంపై తీవ్ర ఆరోపణలు
మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా బర్తరఫ్ చేశారని ఆరోపించారు.
తనను పదవి నుంచి తొలగించడం వెనుక కుట్ర ఉందని, తిరుపతి రెడ్డి తదితరులు కక్షపూరితంగా వ్యవహరించారని అన్నారు. సుమంత్ వ్యవహారంలోనూ తనను, తన కుటుంబాన్ని కావాలనే బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.
“నా కూతురు విషయంలో నన్ను తీసేస్తారా? నాకు చెప్పకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?” అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలు బయటకు వచ్చి గళం విప్పాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. బీసీ మహిళ అయిన తనను మంత్రి పదవి నుంచి ఎలా తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని సురేఖ సూచించారు. మీడియా సమావేశంలో ఓ లేఖను విడుదల చేసి, అందులో తనకు సంబంధించిన అన్ని అంశాలను వివరించినట్లు తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply