పదవి పోయినంక.. పొలం పనుల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి!

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపూర్‌లో మాజీ మంత్రి చిన్నారెడ్డి పొలం పనుల్లో నిమగ్నమై కనిపించారు.

ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగింపుపై స్పందించిన ఆయన.. తనకు పదవి వ్యామోహం లేదని, ‘చిన్నారెడ్డి’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. తనపై తీసుకున్న చర్యలపై ప్రస్తుతం స్పందించనని తెలిపారు.

కాగా, పార్టీ హైకమాండ్‌పై, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణల నేపథ్యంలో చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించింది.

author

Sri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE