Hyd: అమూల్య శ్రీ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు మృతి

హైదరాబాద్: షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహేష్, బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలోని తన నివాసంలో మహేష్ ఉరివేసుకుని ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


అమూల్య శ్రీ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న మహేష్, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో 'క్లూస్ టీమ్' ఆధారాలను సేకరించగా, పోలీసులు మహేష్ మొబైల్ ఫోన్ మరియు కాల్ వివరాలను పరిశీలిస్తున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత అతనికి ఏవైనా బెదిరింపులు వచ్చాయా లేదా కేసు విచారణకు సంబంధించిన భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.

author

Rajashekar

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE