- by Hari
రూ.3 కోట్ల గంజాయి పట్టివేత..!!
అనకాపల్లి: అనకాపల్లి రూరల్ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తుని వైపు తరలిస్తున్న 600 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
గంజాయి రవాణాకు ఉపయోగించిన వ్యాన్, హోండా సివిక్ కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
సంపతిపురం జంక్షన్ వద్ద పక్కా సమాచారంతో పోలీసులు మాటువేసి వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా భారీగా గంజాయి బయటపడింది.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply