- by Hari
ఉంగుటూరు నియోజకవర్గంలో ఉచిత మెగా వైద్య శిబిరం.!!
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామంలో, బీసీవై (BCY) పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు తాడేపల్లిగూడెం గౌతమి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఒక ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది.
ఈ శిబిరంలో డాక్టర్ పూజ (స్త్రీ వైద్య నిపుణులు), డాక్టర్ రమాదేవి (ఎముకల వైద్య నిపుణులు) మరియు డాక్టర్ వంశీ (జనరల్ మెడిసిన్) ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
రక్త పరీక్షలతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply