Health: మలబద్దకం తగ్గాలంటే ఈ తప్పులు చేయకండి!

Health:మారిపోతున్న ఆహారపు అలవాట్లు, చేయి దాటిపోతున్న సమయం ఎన్నో సమస్యలను తెస్తున్నాయి. వాటిలో మలబద్ధకం సమస్య ఒకటి. మలబద్ధకం వచ్చినపుడు మలం చాలా గట్టిగా తయారై.. మల విసర్జన సమయంలో నొప్పితో పాటు కడుపుబ్బరంగా ఉంటుంది. తగినంత నీరు తీసుకోకపోవడం, ఆహారంలో ఫైబర్ లేకపోవడం, ఎక్కువ కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, మల విసర్జనను వాయిదా వేయడం, ఎక్కువ ఒత్తిడితో కూడిన జీవనశైలి, కొన్ని రకాల మందులు వాడడం, ఐరన్, యాంటాసిడ్, పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రసెంట్స్ మందులు వాడడం లాంటి కారణాల వల్ల మలబద్ధకం ఎక్కువవుతుంది. 


ఫైబర్ తో పాటు తగినంత నీరు తీసుకోవాలి. 

స్త్రీలు రోజుకు 21 నుంచి 25 గ్రాములు, పురుషులు 30 నుంచి 38 గ్రాములు విసర్జించినట్లైతే, సరైన విసర్జన జరిగినట్లుగా భావించాలి. అలా జరగని పక్షంలో ఎన్నో ఇతర సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫైబర్ అధికంగా ఆహారాలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి తాజా పండ్లు మరియు కూరగాయలు. పండ్లలో రాస్ బెర్రీ, బేరి పండ్లు, అల్ బుకరా, పుచ్చకాయ ముఖ్యమైనవి. పుచ్చాకయలో 92 శాతం నీటితో పాటు యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, బి, సి తోపాటు లైకోపిన్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఆకుకూరలు కూడా మంచి ఖనిజాలను కలిగి ఉండి, జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేస్తాయి. 


వీటితోపాటు తృణ ధాన్యాలు, ఓట్స్, పప్పుదినుసులు, పండ్లరసాలు, సూపులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండడం, కారం, మసాలాలు తగ్గించడం, ప్రతిరోజూ వ్యాయామం, ఒత్తిడి లేకుండా ఉండడం లాంటి జాగ్రత్తల వల్ల ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చు. మలబద్ధకం సమస్య మరీ తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి.


author

Rajashekar

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE