- by Hari
Diabetis: బేరి పండు - ఔషధ గుణాలు మెండు
-
- by Rajashekar
- in Health
- 0 likes
Diabetis: మనదేశంలో దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్‌తో..13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ముందు జాగ్రత్తగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పండ్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది. టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఏ పండు తినాలో? ఏ పండు తినవద్దో ? తెలియక ఆందోళన చెందుతుంటారు. ఏ పండు తింటే షుగర్ పెరుగుతుందనే భయంతో ఏమీ తినకుండా అలాగే ఉండిపోతున్నారు.
దీంతో వారి శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, సూక్ష్మపోషకాలు అందడం లేదు. అయితే పియర్స్ లేదా బేరి పండును తీసుకోవడం వల్ల బేరి పండులో ఉండే పెక్టిన్ ఫైబర్, లోషుగర్, పాలీఫినాల్స్ కారణంగా.. వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం, ఆపిల్స్, పియర్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు 18% తగ్గుతుందని చెబుతున్నారు.
బేరి పండు వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక బేరి పండులో 5.5 - 7 గ్రాముల వరకు డైటరీ ఫైబర్ ఉంటుంది. జీర్ణకోశంలో జెల్ లాంటి పొరను ఏర్పరిచి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఈ పండు తొక్కలో ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే పియర్స్ లేదా బేరి పండును నిపుణుల సలహాతో మీ డైట్ లో భాగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply