Health Tips: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి కోట్లాదిమంది అభిమానుల మనసులను దోచుకున్న గొప్ప నటుడు. ఈ మహా నటుడు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971న వెంకటరావు-అంజనాదేవి దంపతులకు జన్మించాడు. ఈయన పుట్టిరోజు అంటే అభిమానులకు గొప్ప పండుగ రోజు. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో ఈయన సినిమా కెరీర్ మొదలయ్యింది.


1997 ఆగస్టులో విడుదలైన గోకులంలో సీత చిత్రం హిట్ టాక్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విడుదలైన సుస్వాగతం సినిమా పవన్ కి గొప్ప గుర్తింపును తెచ్చిపెడితే తొలిప్రేమ చిత్రం పవన్ కు స్టార్ హోదాను తీసుకువచ్చింది. తొలిప్రేమ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడాలభించింది. ఆ తర్వాత ఇక పవన్ నటించిన తమ్ముడు, ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 


పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అంబరాన్ని అంటిన సంబరాలు జరుపుకుంటున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవిని చేపట్టి జన నీరాజనాలు అందుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఎప్పుడూ ఆయన ముఖంపై చిరునవ్వు చిగురిస్తూనే ఉంటుంది.


అందుకు కారణం ఆయన పాటించే ఖచ్చితమైన జీవనశైలి అని చెప్పవచ్చు. పవర్ స్టార్ తన శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్ నిలబెట్టుకోవడానికి కఠినమైన యోగా మరియు సాంప్రదాయ ఆహార నియమాలను పాటిస్తారట. ఆయన ఎక్కువగా నూనెలు, మసాలాలు లేని సులభంగా అరిగే సాత్విక ఆహారాన్నే తీసుకుంటారు. తన డైట్ లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఆర్గానిక్ ఆహారాలకే ప్రాధాన్యతనిస్తారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటారు. రాత్రివేళల్లో పాలు, పండ్లు మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతాడట. 


పవన్ కళ్యాణ్ కరాటేలో బాక్సింగ్, వింగ్ చున్ వంటి మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడం వల్ల ఆయనలో గొప్ప స్టామినాతో పాటు ఎప్పుడూ చురుగ్గా ఉండగలుగుతున్నాడు. కంటినిడా నిద్ర , ప్రతిరోజూ యోగాసనాలు, ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని పొందుతున్నాడని తెలిసింది. సినిమాలు, రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన ప్రతిరోజూ తన ఫిట్‌నెస్ సాధనను మానకపోవడమే ఆయన ఫిట్నెస్ వెనుక దాగున్న ఆరోగ్య రహస్యం.

author

Rajashekar

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE