Health: మీ బ్రెయిన్‌ను యాక్టివ్‌గా ఉంచే సింపుల్ చిట్కాలు!

Health: రోజురోజుకీ మన వయసు పెరుగుతుంటే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఆయుష్షు తగ్గిపోతోంది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు నీరసంగా, నిస్సత్తువగా కూర్చోకుండా.. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటే ఆయుష్షు పెరుగుతుంది. యవ్వనంగా ఉండడమంటే, ముడతలు పడని చర్మం కాదు... మలుపులు దాటని మనసు అంటున్నారు వైద్యనిపుణులు. చిన్నచిన్న చిట్కాలు ద్వారా మనసుకు వయసు పెరగకుండా చూసుకోవచ్చు.  


అవేంటంటే.. మంచి మ్యూజిక్ . మన మనసుకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే కొంతమంది తమ దృష్టినంతా ఎప్పుడూ కెరీర్ పైనే ఉంచుతారు. కానీ తరచూ బయటకు వెళ్ళడం, బెస్ట్ ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల ఒత్తిడి తగ్గి ఆయుష్షు పెరుగుతుందనే విషయం తెలియదు. అలాగే మనస్పూర్తిగా నవ్వడం వల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుందని అంటున్నారు పరిశోధకులు.


ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందని.. మనసు హాయిగా ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా ఒకేసారి అనేక రకాల పనులు పెట్టుకోకుండా ఒక్కో పనికి ఒక్కో టైం కేటాయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల కూడా అల్జీమర్స్ లాంటి సమస్యలు దూరమై మెదడు పనితీరు మెరుగుపడుతుంది.


ప్రతిరోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయడం.. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలపాటు కంటినిండా నిద్ర ఉంటే మెదడు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉంటూ.. చక్కని పోషకాహారం తీసుకుంటూ.. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం అవుతుంది అంటున్నారు మానసిక వైద్యులు.

author

Rajashekar

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE