- by Ganesh Adla
శ్రీలంక అండర్ 19 క్రికెటర్లు అరెస్ట్
శ్రీలంకలో అండర్ 19 టీమ్‌కు చెందిన ఇద్దరు క్రికెటర్లు అరెస్టు అయ్యారు. హోటల్ బాత్రూమ్‌లో మహిళలను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీశారనే ఆరోపణలపై వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కొలంబోలో చోటుచేసుకుంది. అరెస్టు అయిన తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మహిళల వీడియోలను ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేశారా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి స్పందిస్తుందా లేదా.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply